బంగ్లాదేశ్ తో రెండో వన్డేలో గాయాన్ని లెక్క చేయకుండా రోహిత్ శర్మ వీరోచితంగా పోరాడాడు. మ్యాచ్ ప్రారంభంలోనే క్యాచ్ కోసం ప్రయత్నించి రోహిత్ గాయపడ్డాడు. రక్తం రావటంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతడు ఇక బ్యాటింగ్ కు రాలేడనుకున్నారు. కానీ, జట్టు కష్టాల్లో పడటంతో కెప్టెన్ గా తన వంతు బాధ్యత నిర్వర్తించాడు. ఏడు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హిట్ మ్యాన్…సిక్సులతో బంగ్లా బౌలర్లను భయపెట్టాడు. మ్యాచ్ గెలవకపోయినా రోహిత్ క్రీడాస్ఫూర్తికి ప్రశంసలు దక్కాయి.