నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన మూవీ ‘అంటే సుందరానికి’. జూన్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. తొలిరోజు నుంచి కలెక్షన్ పరంగా కొంత వెనకబడిన ఈ సినిమా మొత్తంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. మొదటి వీకెండ్ ముగింపు అయిన 7వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.95 లక్షలు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షలు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ ఎనలిస్టులు తెలిపారు.