నీటిని కేంద్రం చేసుకుని అవతార్-2ను అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కించిన జేమ్స్ కేమరూన్ అవతార్-3 పై ఆసక్తికర సమచారం ఇచ్చారు. అవతార్-3 అగ్ని కేంద్రంగా సాగుతుందని వెల్లడించారు. అలాగే ఓమక్తాయా, మెక్టైనా తెగలను పరిచయం చేయబోతున్నట్లు వెల్లడించారు. ‘మీ సీట్‌బెల్ట్ మరింత గట్టిగా పెట్టుకోండి’ అంటూ జేమ్స్ కేమరూన్ సతీమణి సినిమాపై ఆసక్తి మరింత పెంచారు. అవతార్-3 షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన పని ఉంది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.