బంగ్లాతో జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్‌లో విఫలం కావడం వల్లే టీమిండియా ఓడిపోయిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మరో 25 నుంచి 30 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. నామమాత్రపు స్కోరు చేయడంతోనే తాము ఓడిపోయామన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పాడు. తక్కువ స్కోర్ ఉన్నా మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకొచ్చారని ప్రశంసించాడు. తొలి బంతి నుంచే బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారని పేర్కొన్నాడు.