ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మీద వ్యాఖ్యలకు వస్తున్న విమర్శలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. “ ఎవర్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. సినిమా రెండు రకాలు అని నేను చెప్పాను. ఒకటి అవార్డు సినిమాలు, రెండు రివార్డు సినిమాలు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పాను. వాటితో నేను 8 సినిమాలు తీస్తాను అన్నాను. మెుత్తం వినకుండా చిన్న ముక్క పట్టుకొని అబాండాలు వేస్తున్నారు. అలా మాట్లాడితే అది వారి మూర్ఖత్వం” అన్నారు.