విజయ్ హజారే ట్రోఫీలో ఏడు బంతుల్లో ఏడు సిక్స్‌లు కొట్టి మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఐదో సిక్స్ బాదాక తనకు యువరాజ్ సింగ్ గుర్తొచ్చాడని రుతురాజ్ వెల్లడించాడు. ‘ఐదు సిక్సులు కొట్టాక నా మదిలో యువరాజ్ పేరే మెదిలింది. ఇంకొక సిక్స్ కొడితే ఆ ప్లేయర్ సరసన నిలుస్తానని అనిపించింది. సాహసం చేశా. సఫలం అయ్యా. యువరాజ్ రికార్డు సరసన నిలవడం గర్వంగా ఉంది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతానని కలలో కూడా ఊహించలేదు’ అని రుతురాజ్ గుర్తు చేసుకున్నాడు. రేపు మహారాష్ట్ర, సౌరాష్ట్ర మధ్య ఫైనల్ సమరం జరగనుంది.
ఆ క్షణం నాకు యువరాజ్ గుర్తొచ్చాడు

Screengrab Instagram: RUTURAJ GAIKWAD