షార్క్ ట్యాంక్ అనే రియాలిటీ షోతో పాపులర్ అయిన నమిత థాపర్.. ఇన్‌స్టాగ్రాంలో తన అకౌంట్ నుంచి వచ్చిన ఓ ద్వేషపూరిత పోస్ట్‌పై వివరణ ఇచ్చింది. తన ఫోన్ చోరీకి గురైందని, తన పనిపనిషి ఫోన్ చోరీ చేసి ఆ పోస్ట్ పెట్టినట్లు వివరించింది. సెలబ్రిటీగా ఉండటం వల్ల ఈ కష్టాలన్నీ తప్పవంటూ వివరణ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో అనేక మంది ఈ వివరణపై సంతృప్తిగా లేరు. నిజంగానే పనిమనిషి దొంగిలించి అలా పోస్ట్ చేసిందో…లేక ఈమెనే చేసి తప్పించుకునేందుకు పనిమనిషిపై తోసివేస్తోందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.