జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం వాహనం వారాహి కాదని.. నారాహి అని ఏపీ టూరిజం మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆ వాహనంపై వైఎస్సార్సీపీ నాయకులు ఎలాంటి కామెంట్ చేయలేదని స్పష్టం చేశారు. ఎల్లో మీడియానే ఆ వాహనంపై కామెంట్లు చేసిందని ఆరోపించారు. భారత ఆర్మీకి మాత్రమే పచ్చ రంగు వాడే నిబంధన ఉందని గుర్తుచేశారు. కత్తులు పట్టుకుని ట్విటర్లో పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని హితవు పలికారు.