ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లలో ఒకడైన ‘వసీమ్ అక్రమ్’ తన జీవితగాథని ‘సుల్తాన్- ఎ మెమొయిఅర్’ పుస్తకంగా తీసుకొచ్చారు. ఇందులో క్రికెట్ లైఫ్‌తో పాటు, వ్యక్తిగత జీవితం గురించి కూడా వివరించారు. ‘క్రికెట్ నుంచి రిటైరయ్యాక తెలియకుండానే కొకైన్‌కు బానిసయ్యా. దాన్నుంచి కోలుకోవడానికి పునరావాస కేంద్రంలో చేరా. అదెంతో భయంకరంగా సాగింది. అయినా నాలో మార్పు రాలేదు. దీంతో నా భార్య చనిపోయింది. విదేశాల్లో అయితే తండ్రులు ఇంటిపనుల్లో భాగమవుతారు. నేను క్రమంగా మారాను’ అంటూ విషాద సంఘటనలను గుర్తు చేసుకున్నారు.