ప్లాస్టిక్ సర్జరీ వికటించి కన్నడ నటి చేతనా రాజ్ బెంగళూరులోని షెట్టి కాస్మొటిక్ సెంటర్లో మరణించారు. కొవ్వును తొలగించేందుకు సర్జరీ చేస్తుండగా ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ పేరుకుపోయిందని వైద్యులు వెల్లడించారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుతూరు చనిపోయిందని నటి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతనా రాజ్ కన్నడలోని పలు టీవీ సీరియల్స్ ద్వారా అభిమానులను సంపాదించుకున్నారు.