తెలంగాణ రాష్ట్రంలోకి రేపు(జూన్ 7న) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 10 నాటికి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మే 29 నాటికే కేరళ తీరాన్ని రుతుపవనాలు చేరినప్పటికీ ఆ తర్వాత నెమ్మదించి ఇప్పుడు మెరుగయ్యాయని వెల్లడించారు. మరోవైపు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగానే కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని తెలిపారు.