బాలుడిని చిత్ర హింసలు పెట్టి చంపిన మేనత్త

© Envato

వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలో దారుణం వెలుగుచూసింది. కుటుంబ కక్షలతో ఓ మేనత్త పదేళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టి చంపింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించాడు. కోనంపేటకు చెందిన శివ, భాగ్యమ్మలకు ఇద్దరు పిల్లలు. అందులో అయాన్ పెద్దవాడు. శివ సోదరి ఇంద్రజ ప్రేమ వివాహం చేసుకోవడంతో వీరి మధ్య కొంతకాలం గొడవలు జరిగాయి. ఆ తర్వాత అందరూ కలిసిపోయారు, కానీ ఇంద్రజ మనసులో అన్నయ్యపై కోపం పెంచుకుంది. ఈ నేపథ్యంలో శివ కుమారుడిని తన వద్ద చదివిస్తానని తీసుకెళ్లి, చిత్రహింసలు పెట్టింది. చివరికి బాలుడి ప్రాణాలు పోయేలా చేసింది.

Exit mobile version