నూతన సంవత్సరం వేళ ఘోర ప్రమాదానికి గురైన మార్వెల్ ‘అవెంజర్స్’ నటుడు జెరెమీ రెన్నర్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. భారీ వాహనం తనపై పడిన ప్రమాదంలో ‘హాక్ ఐ’ సూపర్‌హీరోకు 30కి పైగా ఎముకలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. “ ఎలాగైతే స్నేహితులు, కుటుంబంతో బంధం దృఢంగా తయారువుతుందో..అలాగే ఈ విరిగిన 30కి పైగా ఎముకలు మళ్లీ దృఢంగా అవుతాయి” అవుతాయి అంటూ రెన్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. 52 ఏళ్ల రెన్నర్ 2 సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు.