ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ముంబై జట్టు 92 ఏళ్ల వరల్డ్ రికార్డును బద్దలుకొట్టింది. రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 725 పరుగుల ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 1929-30లో న్యూసౌత్ వేల్స్ జట్టు 685 పరుగులతో క్వీన్స్ లాండ్ జట్టును ఓడించినదే రికార్డు. తొలి ఇన్నింగ్స్ లో 647/8కి డిక్లేర్ చేసిన ముంబై, రెండో ఇన్నింగ్స్ లో 261/3 వద్ద డిక్లేర్ చేసింది. ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ లో 114, రెండో ఇన్నింగ్స్ లో 69 పరుగులకు కుప్పకూలింది.