స్టేడియంలో బ్లాక్‌లకు హర్భజన్, యువరాజ్ సింగ్ పేర్లు

© File Photo

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మొహాలీ స్టేడియంలోని రెండు బ్లాకులకు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ పేర్లను పెట్టింది. పీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం సెప్టెంబర్ 20న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడు టీ20ల్లో మొదటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో అభిమానులకు ఇద్దరు స్వదేశీ ఆటగాళ్ల పేర్లతో ఆ బ్లాక్స్ దర్శనమివ్వనున్నాయి. 103 టెస్టులు, 236 ODIలు, 28 T20Iలలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి మొత్తం 711 వికెట్లు తీసిన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరును PCA ప్రసిద్ధ టెర్రేస్ బ్లాక్‌కు పెట్టింది. మరోవైపు ఇండియా తరఫున 40 టెస్టులు, 304 ODIలు, 58 T20I మ్యాచ్‌లలో 11,778 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ పేరు స్టేడియం నార్త్ పెవిలియన్‌కు పెట్టింది.

Exit mobile version