ఓ బాలుడి మర్మాంగాలపై ఆకతాయిలు టపాసులు కాల్చిన దారుణ ఘటన హైదరాబాద్లోని గండిమైసమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. టపాసులు పేలుస్తూ వారు వీడియో కూడా తీశారు. యూపీకి చెందిన 16 ఏళ్ల బాలుడు రెడీమిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ బాలుడిని కొంతమంది యువకులు గట్టిగా పట్టుకుని అతడి మర్మాంగాలపై టపాసులు పేల్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలుడి మర్మాంగాలపై టపాసులు కాల్చిన ఆకతాయిలు

© ANI Photo representation