తెలంగాణ: వరకట్నం సరిపోలేదని ఓ వధువు పెళ్లి ఆపిన ఘటన పోచారం మున్సిపాలిటి పరిధిలో జరిగింది. స్థానిక యువకుడికి, ఖమ్మం యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఎదురు కట్నం కింద రూ. 2 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. గురువారం ఆ జంట పెళ్లి పీటలెక్కగా ఒక్కసారిగా వధువు పెళ్లికి నిరాకరించింది. ఎదురు కట్నంగా మరికొంత ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో వరుడి బంధువులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నించినా ఫలించకపోవడంతో పెళ్లి ఆగిపోయింది.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్