విజయవాడ ఓ ఫుట్ బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ బారులో మద్యం మత్తులో తలెత్తిన వివాదంలో ఆకాశ్(23) అనే యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకెళ్తే.. విజయవాడలోని గురునానక్ కాలనీకి చెందిన శంకర్ అలియాస్ టోనీ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడిని చూసేందుకు రెండు వర్గాలకు చెందిన యువకులు భారీగా వచ్చారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న బార్లోకి మద్యం తాగేందుకు వెళ్లారు. వీరిలో ఆకాశ్‌కు మరో వర్గానికి చెందిన యువకులకు గొడవైంది. దీంతో ఆకాశ్ వారిపై చేయి చేసుకున్నాడు. ఇది మనుసులో పెట్టుకున్న ఆ ప్రత్యర్థులు గురునానక్ కాలనీలోని తమ స్నేహితుడి గదికి తీసుకెళ్లి అతనిపై 10 మంది కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆకాశ్ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ప్లేయర్.