దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా FED రేట్ల పెంపు సహా పలు అంశాలు దేశీయంగా ప్రభావం చూపాయి. దీంతో BSE సెన్సెక్స్ 1,045.60 పాయింట్లు క్షీణించి 51,495.79 వద్ద, NSE నిఫ్టీ 331.60 పాయింట్లు కోల్పోయి 15,360.60కు చేరింది. సూచీలు 52 వారాల కనిష్టంతో ముగిశాయి. దాదాపు 607 షేర్లు నష్టాలవైపు పరుగులు తీశాయి. 97 షేర్లు మాత్రం స్థిరంగా కొనసాగాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఓఎన్‌జిసి నిఫ్టీ నష్టపోయిన టాప్‌లో ఉండగా, హెచ్‌యుఎల్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.