గుజరాత్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. నేటితో ప్రచార పర్వానికి తెరపడింది. డిసెంబరు 1న 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోలింగులో ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ బరిలో ఉన్నారు. మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఆప్ తరఫున జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సుడిగాలి పర్యటనలు చేశారు.