తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. మొత్తం 11 అంతస్థుల్లో సచివాలయ నిర్మాణం చేపడుతున్నారు. అయితే, ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండనుంది. 2 నుంచి 5 అంతస్తుల్లో ప్రస్తుతమున్న 16మంది మంత్రుల కార్యాలయాలు రూపుదిద్దుకుంటున్నాయి. 1, 2 ఫ్లోర్లలో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యకలపాలు నిర్వహించనున్నారు. సీఎం, మంత్రుల పార్కింగ్ వేర్వేరుగా ఉండనుంది. 28 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయం సుందరంగా ముస్తాబవుతోంది.