దాయాది దేశం పాకిస్థాన్…అత్యంత దీన పరిస్థితిని చవిచూస్తోంది. శ్రీలంక మాదిరిగానే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అమెరికాలోని రాయబార కార్యాలయాలను సైతం అమ్ముకునే స్థితికి పాక్ దిగజారింది. ఇప్పటికే విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించారు. బల్బులు, ఫ్యాన్ల తయారీని నిలిపివేశారు. రాత్రి 8.30 కల్లా అన్ని మార్కెట్లు, దుకాణాలు, మాల్లు మూసేస్తున్నారు. వివాహాలు కూడా రాత్రి పదిన్నర లోపే పూర్తి చేసేలా ఆదేశాలు వెలువడ్డాయి.గవర్నమెంట్ ఆఫీసుల్లో రూ.600 కోట్లు సేవ్ చేస్తామంటూ 30 శాతానికి పైగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించారు.