చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్ లో అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ చేసిన పర్యటన ఎట్టకేలకు ముగిసింది. తైవాన్ ను ఒంటరిగా వదిలేయబోమని, స్వయం పరిపాలనకు అండగా ఉంటామని నాన్సీ ప్రకటించారు. మరోవైపు ప్రజాస్వామ్య ముసుగులో చైనా సార్వభౌమత్వాన్ని అమెరికా దెబ్బతీస్తోందని డ్రాగన్ దేశం అగ్గిమీద గుగ్గిలమవుతోంది.నిప్పుతో చెలగాటమాడితే మంటల్లోనే కాలిపోతారంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ హెచ్చరించారు. ఇప్పటికే యుద్ధ మాక్ డ్రిల్స్ ప్రారంభించిన చైనా, తైవాన్ పై పలు ఆంక్షలు కూడా విధించింది.