దేశంలో బీఎఫ్ 7 కేసులు నమోదవుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ నేడు అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, నిపుణులతో వర్చువల్గా సమీక్ష చేపట్టనున్నారు. కాగా నిన్న ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో మోదీ పలు కీలక సూచనలు చేశారు. ప్రజలు మాస్కులు ధరించాలని, విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులు చేయాలని, ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాంట్లను పెంచాలని ఆదేశించారు.