భారత క్రికెటర్ మురళీ విజయ్ బీసీసీఐపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐతో తన బంధం ముగిసినట్లేనన్నాడు. విదేశాల్లో అవకాశాల కోసం చూస్తున్నాని తెలిపాడు. “ భారత్లో 30 ఏళ్లు దాటిన వారిపై వివక్ష చూపుతారు. వాళ్లు మమ్మల్ని వీధిలో నడుస్తున్న 80 ఏళ్ల వృద్ధులుగా చూస్తారు. నేను ఎలాంటి వివాదాల్లోకి రావాలనుకోవడం లేదు. నేను ప్రస్తుతం సరైన ఆటతీరు కనబరుస్తున్నా తక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అందుకే బయట ప్రయత్నించాలి అనుకుంటున్నాను” అన్నాడు.