ఎం.ఎస్ ధోనీని జాతీయ జట్టులోకి తీసుకోవాలని సిఫార్సు చేసిన మాజీ క్రికెటర్ ప్రకాశ్ పొడ్డార్ మృతి చెందారు. 82 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. 2002లో బీసీసీఐ ఏర్పాటు చేసిన ‘టాలెంట్ రీసోర్స్ డెవలప్మెంట్’ ఆఫీసర్‌గా ప్రకాశ్ పనిచేశారు. దేశంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం ఈ అధికారి ముఖ్య విధి. దీంతో ధోనీ పేరును బీసీసీఐకి సిఫార్సు చేశారు. ‘ధోనీ సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయా. అతడి సామర్థ్యాన్ని మరింత సానబెడితే జాతీయ జట్టులో రాణించగలడన్న నమ్మకంతోనే పేరు సిఫార్సు చేశా’ అని అప్పట్లో పొడ్డార్ వెల్లడించారు. బెంగాల్ జట్టుకు కెప్టెన్‌గానూ ప్రకాశ్ పొడ్డార్ వ్యవహరించారు.