కర్ణాటక మహాదేవ్పుర్లో వింత ఘటన వెలుగుచూసింది. పెళ్లైన మరుసటి రోజే ఓ నవవరుడు తన భార్యను వదిలి పారిపోయాడు. జార్జ్ అనే 26 ఏళ్ల యువకుడికి అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతితో ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. అయితే నూతన దంపతులు పెళ్లైన మరుసటి రోజు చర్చికి వెళ్లి వస్తుండగా రోడ్డుపై ఓ చోట ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సరైన సమయంగా భావించిన జార్జ్ కారు డోర్ తీసుకుని పారిపోయాడు. రెండు వారాలైన తిరిగిరాకపోవడంపై వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది.