దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా అబ్బాయిలే ఉంటున్నారు. ఇందుకు సంబంధించి లాన్సెట్ ఓ తాజా నివేదికు వెల్లడించింది. అమ్మాయిలతో పోలిస్తే పురుషుల్లోనే అధిక ప్రభావం ఉందని తెలిపింది. సమాజంలో లింగ వివక్షే కారణమని పేర్కొంది. 2005 నుంచి 2019 మధ్య మూడు ఆస్పత్రులతోపాటు కొన్ని రిజిస్ట్రీల రికార్డులను సేకరించి నివేదిక రూపొందించింది. పీబీసీఆర్ లో 11 వేలు, ఇతర ఆస్పత్రుల్లో 22 వేల క్యాన్సర్ రోగుల్లో అబ్బాయిల సంఖ్యే అధికంగా ఉందని చెప్పింది.