సాధారణంగా సింహానికి ఏ జంతువైనా భయపడి ఆమడ దూరం పారిపోతుంది. అయితే ఓ కుక్క మాత్రం సింహాన్నే భయపెట్టిసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా లోధికా తాలూకా పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్రామంలోకి వచ్చిన మృగరాజును, అక్కడే పంట పొలాలకు కాపలాగా ఉన్న కుక్క చూసింది. సింహాన్ని చూసి ఏ మాత్రం జంకకుండా ఎదురు నిలబడి మృగరాజును తమిరి కొట్టింది. సింహాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన జనాలు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.