తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణలో నిన్నటిదాకా సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఇవాళ పడిపోయాయి. మూడ్రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, గద్వాల, సూర్యాపేట మినహా రాష్ట్రమంతా ఇవాళ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రెేపు, ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుంచి 16 డిగ్రీల వరకూ నమోదవుతాయని అంచనా వేసింది. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 8 డిగ్రీల వరకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.