టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ను భారత ఫ్యాన్స్ ఆటపట్టించారు. శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో గిల్ ఫీల్డింగ్ చేస్తుండగా కొంతమంది అభిమానులు సారా.. సారా అంటూ అరిచారు. దీనికి సమాధానంగా గిల్ కూడా వారికి అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ‘‘ఇంతకు సారా టెండూల్కరా.. సారా ఆలీఖానా.. తేల్చి చెప్పు గిల్’’ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.