మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ వేడుకలో గర్భాలో నృత్యం చేస్తూ 35 ఏళ్ల వ్యక్తి కుప్పకూలాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తండ్రి అక్కడికక్కడే గుండె పోటుతో ప్రాణాలు వదిలాడు. శని, ఆదివారాల మధ్య రాత్రిలో ఇది జరిగింది. కుమారుడు కుప్పకూలగానే తండ్రే ఆసుపత్రికి తరలించాడని, తన చేతుల్లోనే కుమారుడు చనిపోవడంతో ఆయన తట్టుకోలేక గుండె ఆగిపోయిందని పోలీసులు తెలిపారు.
డ్యాన్స్ చేస్తూ కొడుకు..అది చూసి తండ్రి మృతి

© Envato(representational)