గ్రీన్ ఎనర్జీని ప్రొత్సహించే దిశగా దేశంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్ట్ వినియోగ అవసరాల కోసం పవన శక్తిని ఉపయోగిస్తున్న తొలి ఎయిర్ పోర్టుగా నిలిచింది. ఇప్పటికే సోలార్ విధానం ప్రారంభించిన ఈ ఎయిర్ పోర్ట్ తాజాగా పవన విద్యుత్ వ్యవస్థను కూడా ఆరంభించింది. సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గించడం, ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ విమానాశ్రయం కృషి చేస్తుందని నిర్వహకులు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.