ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ 2023 ప్రథమార్థంలో తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును లాంచ్ చేయనున్నట్లు జీప్ మాతృసంస్ధ స్టెలాంటిస్ ప్రకటించింది. ఈ కారు స్టెలాంటిస్ ఎస్‌టీఎల్‌ఏ ప్లాట్‌ఫాంపై రూపొందనుండగా.. ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో రెక్టాంగ్యులర్ హెడ్‌ల్యాంప్స్‌తో ఈ ఎస్యూవీ రానుంది. 2023 తొలి త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభమై.. ఆరు నెలల తరువాత ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. 2024లో ఈ కారు ఇండియాలో అందుబాటులో రానున్నట్లు తెలుస్తుంది.