• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో ఏర్పాటు!

    గతంలో ఏటీఎం అంటే కేవలం డబ్బులు తీసుకోవడానికి అని అనేక మందికి తెలుసు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొత్తగా వాటర్, మిల్క్ కోసం ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు చేసే మిషన్లు వచ్చాయి. తాజాగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్ లో మరో నెల తర్వాత ప్రారంభించనున్నారు. ఈ మేరకు గోల్డ్ సిక్కా సంస్థ ప్రకటించింది. ఈ మిషన్లలో అర గ్రాము నుంచి 10 గ్రాముల వరకు గోల్డ్ ఉంటుందని సంస్థ నిర్వాహ‌కులు చెబుతున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల సహాయంతో బంగారం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు దుకాణాల కంటే ఇక్కడ తక్కువ ధర ఉంటుందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.