తెలంగాణ సీఎం కేసీఆర్ నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి తొలిసారి కర్ణాటకలో పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామికి చెందిన జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి బీఆర్ఎస్ పోటీచేయనుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వీరితో సమావేశం నిర్వహించారు. ఆది నుంచి కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతున్న ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకలో బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ తొలిపోరు కర్ణాటకతోనే మొదలు కానుంది.
బీఆర్ఎస్ తొలి అడుగు కర్ణాటకలోనే

Courtesy Twitter:TRS