టీమిండియా మాజీ అండర్ 19 జట్టు కెప్టెన్ విజయ్ జోల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్‌తోపాటు అతడి సోదరుడు విక్రమ్, మరో 18 మందిపై కిడ్నాప్, దోపిడీ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ క్రిప్టో మేనేజర్‌ను కిడ్నాప్ చేసి, 10 రోజుల పాటు ఓ ఇంట్లో బంధించి దాడి చేసినందుకు గానూ విజయ్ జోల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తమ దగ్గర లక్షల్లో క్రిప్టో కరెన్సీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని విజయ్ కేసు పెట్టాడు.