అమరావతిపై అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం

Courtesy Twitter: CMO AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 190 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం అందులో ప్రధానంగా రైతులకు నెలరోజుల్లో ప్లాట్లు ఇవ్వాలన్న ఆదేశంపై అఫిడవిట్‌లో ప్రస్తావించింది. కాగా రైతులకు ప్లాట్లు పూర్తి చేసి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి నెలరోజులు గడుస్తుండడంతో.. చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి స‌మీర్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు.

Exit mobile version