మాండౌస్ తుపాను పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముందు జాగ్రత్త చర్యలపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఉండటంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు సహా అన్నమయ్య, కడప కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలతో రహదారులు దెబ్బతింటే సత్వర చర్యలు చేపట్టాలన్నారు.