తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలలలో జనరిక్ మెడిసిన్నే రాయాలని వైద్యులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ బ్రాండ్ల పేరుతో వైద్యులు మందులు రాస్తున్నారని ఇది జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఆ శాఖాధికారులతో జరిపిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వైద్యులపై చర్చలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ సమయంలో వైద్యులు జెనెరిక్ మెడిసిన్ కాకుండా వేరే మందులను రాస్తూ ఉంటారు.