భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సత్తిబాబు ఇద్దరు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి. చర్ల మండలానికి చెందిన స్వప్నకుమారిని సత్తిబాబు ఇంటర్‌లో ఉన్నప్పటి నుంచి ప్రేమించాడు. మరోవైపు, వరుసకు మరదలు అయిన సునీతనూ ఇష్టపడ్డాడు. దీంతో వీరిద్దరినీ ఇంటికి తెచ్చుకుని సహజీవనం చేశాడు. స్వప్నకు కుమార్తె, సునీతకు బాబు పుట్టడంతో పెళ్లి చేసుకోవాలని పెద్దలు నచ్చజెప్పారు. ఇద్దరినీ చేసుకుంటానని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యాడు. గిరిజన సంప్రదాయంలో పెళ్లి జరగనుంది. అయితే, వారి ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిస్తున్నట్లు పెద్దలు వెల్లడించారు.