ములుగు జిల్లాకు చెందిన న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖను పిల్ గా పరిగణించి విచారణ ప్రారంభించింది.సీఎస్, డీజీపీ, ములుగు ఎస్పీని ప్రతివాదులుగా చేర్చింది.హోం, న్యాయశాఖల ముఖ్యకార్యదర్శులను సైతం కోర్టు ప్రతివాదులుగా చేర్చింది.