లవర్‌తో వెళ్లిన భర్త..ఆచూకీ చెబితే ప్రైజ్ ఇస్తానన్న భార్య

© Envato

భర్త ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తానని ఓ బాధిత భార్య తెలిపింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్వప్న అనే మహిళకు 2012లో విక్రమ్‌తో పెళ్లైంది. ప్రస్తుతం అతను నిరుద్యోగిగా ఉండగా, ఆమె సోలంకి గ్రామంలో అసిస్టెంట్ సెక్రటరీగా జాబ్ చేస్తుంది. ఆ క్రమంలో వారి మధ్య గొడవలు తలెత్తగా, ఆగస్టు 17 నుంచి తన భర్త కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త ప్రియురాలితో వెళ్లే క్రమంలో రూ.2 లక్షల నగదు, ఆభరణాలు తీసుకెళ్లాడని, భర్త ఆచూకీ తెలిపిన వారికి ప్రైజ్ కూడా ఇస్తానని వెల్లడించింది.

Exit mobile version