దుబాయ్‌లో ఉంటున్న భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ సమీర్ అలన్ అనే వ్యక్తి జాక్‌పాట్ కొట్టేశాడు. అబుదాబిలో బిగ్ టికెట్ లాటరీ వాళ్లు నిర్వహించిన టికెట్డ్రాలో వెయ్యి దిర్హమ్స్‌తో, తన స్నేహితులతో కలిసి ఒక టికెట్ కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన టికెట్(నం.192202) డ్రాలో ఎంపికవడంతో 12 మిలియన్ దిర్హమ్స్(ఇండియన్ కరెన్సీలో రూ.24.80 కోట్లు) గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తంలో లాటరీ గెలుచుకోవడంతో అతను ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఈ రూ.24.80 కోట్లలో 500 దిర్హమ్స్ పెట్టిన సమీర్‌కు రూ.12.40 కోట్లు దక్కనుంది. మిగతాది వాళ్ల స్నేహితులకు చెందుతుంది.