నిజామాబాద్ సజీవదహనం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు గురైన బాబు స్వస్థలం మహారాష్ట్రగా గుర్తించారు. నాందేడ్ జిల్లా లాగలూద్ గ్రామానికి చెందిన వాడని పేర్కొన్నారు. బాబుపై ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాకపోవటంతో సీసీ టీవీ పరిశీలించారు. మహారాష్ట్రలో రైలు ఎక్కినట్లు గుర్తించారు. కూలీ పనుల నిమిత్తం నిజామాబాద్ వెళ్లాడని తెలిసింది. బీమా సొమ్ముతో అప్పులు తీర్చాలని తనలాగే ఉండే వ్యక్తిని హత్య చేసి కారులో మృతదేహాన్ని దహనం చేయడం తెలిసిందే.