మెగాస్టార్ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని చివరి పాటను రేపు చిత్రబృందం విడుదల చేయనుంది. ‘నీకేమో అందమెక్కువ.. వీరయ్యకి తొందరెక్కువ’ అంటూ సాగే పాటని హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బాబీ, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, డ్యాన్స్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ రానున్నారు. ఫ్రాన్స్‌లో ఈ పాట చిత్రీకరణ చేసినట్లు ఇటీవల చిరంజీవి వెల్లడించారు. ఈ నెల 13న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.