దిల్లీలో కవిత దీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. ముందుగా అనుకున్నట్లుగానే జంతర్ మంతర్ వద్ద ఆమె దీక్ష చేపట్టనున్నారు. ధర్నా చేపట్టేందుకు భాజపా మరో స్థలాన్ని చూసుకుంది. దీన్‌దయాల్ మార్గ్‌లో కమలం నేతలు నిరసన తెలుపనున్నారు. ఇప్పటికే కవిత దీక్షకు అనుమతిచ్చిన పోలీసులు మధ్యాహ్నం షరతులు విధించారు. ఆమె పోలీసులతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో భాజపా మరో స్థలాన్ని చూసుకోవటంతో లైన్ క్లియర్ అయ్యింది.