ఆ చిన్నతప్పుకు రూ.కోట్లలో నష్టం ?

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసారా’ మూవీ థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్స్, పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ మూవీని రూ.40కోట్లతో తెరకెక్కించగా.. కేవలం 15 శాతం లాభంతోనే ఈ మూవీని అమ్మారు. ఈ వీకెండ్‌కే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. దీంతో డిస్టిబ్యూటర్స్‌కు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కేవలం 15 శాతం లాభంతోనే సినిమాను అమ్మడంతో కళ్యాణ్ రామ్ భారీగా నష్టపోయాడనే చెప్తున్నారు. ఇంకా ఎక్కువ రేటుకు అమ్మితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు ఎనలిస్టులు.

Exit mobile version