మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్!

© Envato

ఆడ, మగ పెళ్లి చేసుకుంటే అది సహజం. ఈ మధ్య ఇద్దరు మగాళ్లు, ఇద్దరు ఆడాళ్లు పెళ్లి చేసుకోవడమూ సహజమే అయిపోయింది. కానీ మెక్సీకో నగర మేయర్ ఓ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. సంప్రదాయ దుస్తుల్లో అలంకరించిన మొసలిని పెళ్లి చేసుకుని దానికి ముద్దు కూడా పెట్టాడు.అయితే ఇదంతా ఓ ఆచారంలో భాగమట. వర్షాలు సమృద్ధిగా కురవాలని, నదిలో చేపలు బాగా పెరగాలని దేవుడిని మొక్కేందుకు ఇలా చేస్తారట. అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లి వీడియోను రాయిటర్స్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version