గత తొమ్మిదేళ్లుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మీడియాకు మొహం చాటేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇప్పటివరకు మోదీ ఓపెన్ కాన్ఫరెన్స్ పెట్టలేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్కు వందల మంది విలేకరులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందన్నారు. మీడియా ముసుగులో రాజకీయాలు పెరిగిపోయాయని.. నాలుగైదు పేపర్లు చదివితేనే వాస్తవం తెలుస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం టీయూడబ్ల్యూజేకు రూ.100 కోట్లు ఇచ్చిందని తెలిపారు.